భళా.. బాల ప్రతిభా కారంజి.! | - | Sakshi
Sakshi News home page

భళా.. బాల ప్రతిభా కారంజి.!

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

హొసపేటె: ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యత అని విజయనగర ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప అన్నారు. విజయనగర జిల్లా హొసపేటెలోని లిటిల్‌ ఫ్లవర్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో బుధవారం నిర్వహించిన తాలూకా స్థాయి ప్రతిభా కారంజి కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల అభ్యాసానికే పరిమితం కాకుండా సంగీతం, నృత్యం, ఉపన్యాసం, నాటక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొనాలన్నారు. ఇలాంటి పోటీలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమని అన్నారు. బీఈఓ ఉమాపతి భక్తిగీతం ఆలపించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. చదువుతో పాటు సంగీతం, నృత్యం, సాహిత్యం, కళలు వంటి వివిధ రంగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. టీపీ ఈఓ ఆలం బాషా, క్షేత్ర సమన్వయ అధికారి శివకుమార్‌, విద్యా సమన్వయకర్త అబ్దుల్‌ కలాం, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి యువజనోత్సవం

జిల్లా ఇండోర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాన్ని ఏడీసీ పీఎన్‌.లోకేష్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. పోటీల్లో జానపద నృత్యం, నాటకం, కవితల రచన, చిత్రలేఖనం తదితర విభాగాల్లో యువత తమ ప్రతిభను చాటారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

హొసపేటెలో బాలల సందడి

విద్యార్థుల్లో దాగిన ప్రతిభ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement