బనశంకరి: బెంగళూరు నగరంలో పెచ్చుమీరుతున్న నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, శరవేగంగా విస్తరిస్తున్న సిటీలో శాంతిభద్రతలను కాపాడుతూ, ట్రాఫిక్ సమస్యను తగ్గించడం లక్ష్యంగా ఒకటిగా ఉన్న కమిషనరేట్‌ను 5కు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయానికి నాంది పలికింది.
అదనంగా సెంట్రల్
● బెంగళూరు ప్రధాన కమిషనర్ పర్యవేక్షణలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, అలాగే సెంట్రల్ కమిషనర్ కార్యాలయాలు పనిచేస్తాయి. ఒక్కో కమిషనరేట్‌కు ఒక్కో కమిషనర్ నియమితులయ్యారు.
●ప్రధాన కమిషనర్ హితేంద్ర పోలీస్ పరిపాలన, నేర నియంత్రణ, ఇంటెలిజెన్స్, భద్రతతో పాటు ఇతర విభాగాలను పర్యవేక్షిస్తారు.
అదనపు డీజీపీ హేమంత్ నింబాళ్కర్ చీఫ్‌గా నగర ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ట్రాపిక్ డీసీపీలు కూడా ఉంటారు.
రూ.764 కోట్ల వ్యయం
కొత్త వ్యవస్థలో 29 మంది డీసీపీలతో పాటు 6 వేల పోస్టులు సృష్టించి, సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం రూ.764 కోట్లు ఖర్చు చేయనుంది. ఆరంభంలో పోస్టుల నిర్వహణకు రూ.48 కోట్లు, పోలీస్‌స్టేషన్ కట్టడాలు, వాహనాలు, యంత్రోపకరణాలు, ఫర్నిచర్ కొనుగోళ్లకు రూ.82.23 కోటి అవసరమని అంచనా.
నూతన మార్పు తెస్తా: హితేంద్ర
బెంగళూరు ప్రధాన పోలీస్ కమిషనర్‌గా ఆర్.హితేంద్రను ప్రభుత్వం బుధవారమే నియమించింది. తన అనుభవం ఆధారంగా సిటీ పోలీస్ శాఖలో కొత్త మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.
ఒక్క రాజధానిలో 5 పోలీసు
కమిషనరేట్లకు శ్రీకారం
5 మంది కమిషనర్ల నియామకం
వారిపై ప్రధాన కమిషనర్ పర్యవేక్షణ
సర్కారు నూతన ప్రయోగం


