మేకెదాటుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది | - | Sakshi
Sakshi News home page

మేకెదాటుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

శివాజీనగర: ‘రాష్ట్రంలో పార్టీలు విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ ఏకతాటిపై మేకెదాటు తాగునీటి ప్రాజెక్టుకు మద్దతు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవేగౌడ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అసూయతో మాట్లాడితే దాన్ని సీరియస్‌గా తీసుకోరాదు’ అని సీఎం డీ.కే.శివకుమార్‌ తెలిపారు. గురువారం నగరంలోని నెహ్రూ ప్లానెటేరియం వద్ద మీడియాతో మాట్లాడారు.

మేకెదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటకకు సుప్రీంకోర్టులో న్యాయం లభించింది. కర్ణాటక తన పరిధిలో ఆనకట్టను నిర్మించుకోవచ్చని, తమిళనాడుకు హక్కుగా చెందాల్సిన నీటిని ఆ రాష్ట్రానికే ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. కోర్టు ఆదేశాన్ని పాటిస్తామని, తమిళనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ పేరు తెచ్చుకోవాలంటూ తాము అక్కడికి వెళ్లలేదని అన్నారు.

బెంగళూరుకు తాగునీరు

మేకెదాటు ప్రాజెక్ట్‌ ఏ ఒక్క పార్టీకి లేదా వ్యక్తికి చెందినది కాదు, యావత్‌ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్న అని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల మండ్య, హాసన్‌, తుమకూరు, మైసూరు జిల్లాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని, బెంగళూరు తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం అందిస్తుందని చెప్పారు. బెంగళూరుకు తాగునీరే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించే ప్రతిపాదన లేదన్నారు. కరువు వంటి కష్టకాలంలో మేకెదాటు జలాశయం ప్రయోజనకరంగా ఉంటుంది. తమిళనాడు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా చట్ట పరిధిలోనే పోరాడి న్యాయం సాధించామన్నారు. రెండు రాష్ట్రాలకు అంతే న్యాయం జరగాలన్నదే మా వైఖరని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఒక్క రోజులోనే అనుమతి తెచ్చిపెడతానని కేంద్రమంత్రి కుమారస్వామి చెప్పారు, ఆయన ఆ పని చేస్తారని నమ్మకం ఉంది అన్నారు. ఆయన తండ్రి దేవేగౌడ మేకెదాటు కోసం కేంద్రానికి లేఖ రాస్తే, కొడుకు కుమారస్వామి అసూయతో ఏమైనా మాట్లాడవచ్చు, దానిని పట్టించుకోరాదు అని విమర్శించారు.

తాగునీటి కోసమే జలాశయం

తమిళనాడుకు ఇబ్బంది ఉండదు

సీఎం డీకే శివకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement