మధ్యతరగతి కుటుంబాలకూ ఆర్టీఈ | - | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి కుటుంబాలకూ ఆర్టీఈ

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

శివాజీనగర: ఆర్టీఈ పరిధిలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రూ.3.5 లక్షల వరకూ ఉన్న పరిమితిని రూ.8 లక్షలకు పెంచుతూ పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ ఉత్తర్వు జారీ చేసింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు కూడా ఉచితంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు పేద పిల్లల కోసం కేటాయించారు. ఆదాయ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.

దేశంలోనే అత్యధికం?

ఇప్పుడు సడలించిన వార్షిక ఆదాయ పరిమితి దేశంలోనే అత్యధికమని విద్యాశాఖ అధికారులు చెప్పారు. గుజరాత్‌లో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు, ఢిల్లీలో రూ.5 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఆదాయ పరిమితి పెరిగినంత మాత్రాన, పిల్లలందరికీ ఉచిత అడ్మిషన్‌ లభిస్తుందన్న హామీ లేదు. ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియ నియమాల లోపు అర్హత కలిగి ఉండాలి. మొత్తంగా భారీ ఫీజుల బెడద లేకుండా తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చదించాలన్నకుంటున్న వేలాది మంది తల్లిదండ్రులలో పరిమితి పెంపు ఆశలను రేకెత్తించింది.

ఆర్టీఈ ఆదాయ పరిమితి

రూ.8 లక్షలకు పెంపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement