టీబీ డ్యాం కింద పంటలను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాం కింద పంటలను కాపాడండి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

సాక్షి, బెంగళూరు: తుంగభద్ర జలాశయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద మిగిలిన నాలుగు టీఎంసీల నీటిని ఉపయోగానికి అనుమతించాలని సీఎం డీకే శివకుమార్‌ను మంత్రి శివరాజ్‌ తంగడగి, ఆ జిల్లాల నాయకులు కోరారు. జలాశయం కిందనున్న జిల్లాల్లో పంటలను నవంబర్‌ 30 వరకు కాపాడుకోవాల్సి ఉందని, ఏపీ కోటా నీటిని వాడుకోవడానికి ఆ రాష్ట్రంలో మాట్లాడి ఒప్పించాలని సీఎంకు విన్నవించారు. కర్ణాటక వాటా కింద పంపిణీ చేసిన నీటి ప్రమాణం (70.807 టీఎంసీల)లో తాగునీటి కోసం 10.71 టీఎంసీలు, సాగు నీటి కోసం 60 టీఎంసీలు కేటాయించారని, ఇందులో అక్టోబర్‌ నాటికే 51 టీఎంసీలు వినియోగించినట్లు మంత్రి తెలిపారు. ఏపీ సీఎంతో మాట్లాడుతానని డీకే శివకుమార్‌ హామీనిచ్చారు.

30 వరకూ కృష్ణా జలాలు ఇవ్వాలి

కృష్ణా పరీవాహక ప్రాంతంలో రైతులు తీవ్రమైన కరువులో చిక్కారని, ఆయా డ్యాముల్లో ఉన్న నీటిని నవంబర్‌ 30 వరకు పంట కాలువలకు విడుదల చేయాలని సీఎం డీకే శివకుమార్‌కు మంత్రి అజయ్‌ ధరంసింగ్‌ మనవి చేశారు. ఆలమట్టి, నారాయణపుర జలాశయాల్లో ప్రస్తుతం మొత్తం సుమారు 53 టీఎంసీల నీరు ఉందని, రైతులు సాగు చేసిన పత్తి, కంది, మిరప పంటలకు అవసరమైన నీటిని నవంబర్‌ 30 వరకు అయినా పంపిణీ చేయాలని కోరారు.

ఏపీ కోటాలోని 4 టీఎంసీలను ఇవ్వండి

సీఎంకు మంత్రి శివరాజ్‌, ఆ ప్రాంత నేతల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement