మైసూరు: లోకాయుక్త పోలీసులు గురువారం మైసూరు నగరంలోని పశ్చిమ ప్రాంతీయ ఆర్టీఓ కార్యాలయంపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ గిరీష్ నేతృత్వంలోని సిబ్బంది తనిఖీలలో ఆఫీసులో ఐదుగురు ఏజెంట్లు అక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారు ఉద్యోగులకు సహాయంగా రకరకాల పనులు చేస్తున్నారు. విచారించి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, లైసెన్స్ పునరుద్ధరణ, బదిలీ వంటి పెండింగ్ ఫైళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని ఉద్యోగులను విచారించారు. ఏజెంట్లను రానివ్వద్దని, ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు.
ఏజెంట్ల సేవలపై ఆగ్రహం


