పేదల జేబులు పిక్‌ ప్యాకెట్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల జేబులు పిక్‌ ప్యాకెట్‌

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో దుష్ట, లూటీ ప్రభుత్వం అధికారంలో ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ బస్సు చార్జీల ధరల పెంపును ఖండిస్తూ బెంగళూరు మెజిస్టిక్‌ బస్టాండులో గురువారం ఆందోళన చేశారు. బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌, ఎమ్మెల్యేలు, నాయకులు చేతిలో భిక్షపాత్ర పట్టుకుని నిరసన తెలిపారు. ఆర్‌.అశోక్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గ్యారెంటీ పథకాలకు ఐదారు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, ఆ డబ్బులు లేక ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగలేదని చెప్పడం లేదని, అయితే దాని వల్ల వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు తిరిగి ఇవ్వాలని కోరారు. పాలు, పెరుగు, నెయ్యి ఇలా అన్ని ధరలు పెంచారని, సామాన్య ప్రజలు ఏమి తిని బతకాలని అన్నారు. ప్రజల జేబులను సర్కారు పిక్‌ ప్యాకెటింగ్‌ చేస్తోందన్నారు. బస్సు చార్జీలను 30 నుంచి 40 శాతంపెంచడం వల్ల సామాన్య ప్రజలు, విద్యార్థులు, కార్మికులపై ఆర్థికంగా భారం పడుతుందన్నారు. సర్కార్‌ దివాళా తీసిందని, ఆదుకునేందుకు భిక్ష వేయాలని పాటలు పాడుతూ ప్రయాణికుల వద్ద యాచన చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం డీకే, రవాణా మంత్రి బైరతి సురేశ్‌ మాస్కులను ధరించారు.

ధరల పెంపుపై బెంగళూరు

బస్టాండులో బీజేపీ భిక్షాటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement