బంగారంతో బెంగాల్‌కు పరారీ | - | Sakshi
Sakshi News home page

బంగారంతో బెంగాల్‌కు పరారీ

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

● ఘరానా కార్మికుడు అరెస్టు

బనశంకరి: భారీ మొత్తంలో బంగారాన్ని ఎత్తుకెళ్లిన పశ్చిమబెంగాల్‌ కు చెందిన బంగారు కార్మికున్ని బెంగళూరు సుబ్రమణ్యనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతని వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువచేసే 679 గ్రాముల బంగారు నగలను సీజ్‌ చేశారు. నిందితుడు నూర్‌ ఇస్లాం మల్లిక్‌ మంజునాథనగరలో ఉంటూ రాజాజీనగర 1వ బ్లాక్‌లో నగలు తయారు చేసే వ్యాపారి వద్ద పనిచేసేవాడు. ఆగష్టు 20వ తేదీన ఇతనికి కొంత బంగారం ఇచ్చి నగలు తయారుచేయాలని యజమాని తెలిపాడు. కానీ అతడు బంగారంతో సొంతూరికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు పశ్చిమ బెంగాల్‌లో బర్దమాన్‌ జిల్లా కాల్నానగరలో మల్లిక్‌ను పట్టుకుని బెంగళూరుకు తీసుకువచ్చారు. అతని భార్య నుంచి 441 గ్రాముల బంగారు ఆభరణాలను, మంజునాథ నగరలోని ఇంట్లో దాచి ఉంచి 238 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశారు. కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ సింగ్‌ ఆ నగలను పరిశీలించి పోలీసులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement