ఎక్కువ ఉప్పు.. ఆరోగ్యానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ ఉప్పు.. ఆరోగ్యానికి ముప్పు

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

శివాజీనగర: నేటిరోజుల్లో కూరల్లో, వంటల్లో ఉప్పు వాడకం అధికంగా ఉంది, రుచి కోసం ఎక్కువ ఉప్పును వాడుతున్నారు. ఉప్పు అధిక వినియోగం గురించి ఆరోగ్య శాఖ.. ప్రజలు, పాఠశాలలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ సంస్థలను హెచ్చరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఉప్పు ఎక్కువైతే రక్తపోటు, గుండెపోటు ముప్పు పెరుగుతుందని వైద్యులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోరాదని ఆరోగ్య శాఖ తెలిపింది.

రోజుకు 5 గ్రాముల లోపే..

● రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడుకోవచ్చు

● వంటల్లో ఉప్పు తగ్గించాలి. ఊరగాయలు, పచ్చళ్లు, స్నాక్స్‌ తయారు చేసేటప్పుడు తక్కువ ఉప్పును వాడాలి

● తినే ముందు రుచి చూడకుండా ఆహారంలో ఉప్పు వేయవద్దు

● ప్రాసెస్‌ చేసిన, ప్యాక్‌ చేసిన, రెడీమేడ్‌ ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదా తక్కువగా తీసుకోవాలి. రెడీమేడ్‌ ఆహారంలో ఉప్పు శాతం ఎంత ఉందో చూడాలి. మరీ ఎక్కువ ఉంటే ఉపయోగించరాదు

● తాజా ఆహారం, పండ్లు, కూరగాయలను ఎక్కువగా భుజించాలి

● తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే ఉప్పును తక్కువగా వాడడం అలవాటు చేయాలి

● బీపీ లేదా ఇతర వ్యాధులు ఉన్నవారు ఉప్పు వాడకంపై వైద్యుల సలహా తీసుకోవాలి.

ఆరోగ్య శాఖ హెచ్చరికలు

వాడకంపై మార్గదర్శకాలు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement