రాజధానిలో జడివాన | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో జడివాన

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

బనశంకరి: బెంగళూరులో సోమవారం అర్ధరాత్రి ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామువరకు భారీ వర్షం కురిసింది. రోడ్లు, కూడళ్ల జలమయమై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. వైట్‌ఫీల్డ్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బళగెరె, బెళ్లందూరుతో పాటు తూర్పు బెంగళూరులో జడివాన కురిసింది. వాననీరు నిలిచి రోడ్లు మడుగులుగా మారాయి. వైట్‌ఫీల్డ్‌ చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఇబ్బంది ఏర్పడింది. మల్లేశ్వరం స్మార్ట్స్‌బజార్‌ ముందు భారీ చెట్లు కూలి ట్రాఫిక్‌ స్తంభించింది. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాలికే సిబ్బంది చెట్లను తొలగించారు. కోరమంగలలో కూడా చెట్టు పడింది. ఉదయం పనుల మీద బయటకువెళ్లే ప్రజలకు వాననీటితో ఇబ్బందిగా మారింది.

6 జిల్లాలకు అలర్ట్‌

బెంగళూరు, తుమకూరు, చిక్కమగళూరు, హాసన్‌, మండ్య, మైసూరు, చామరాజనగర జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షాలు రావచ్చని ఎల్లో అలర్ట్‌ని ప్రకటించింది. 1వ తేదీ వరకు వర్షసూచన తెలిపింది.

రోడ్లు, కూడళ్లు జలమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement