బళ్లారి రూరల్: అల్లం సుమంగళమ్మ స్మారక మహిళా కళాశాలలో ఈనెల 21 నుంచి రెండు రోజుల పాటు సువర్ణ మహోత్సవాలు నిర్వహిస్తామని వీవీ సంఘం కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి తెలిపారు. శుక్రవారం వీవీ సంఘం పాలనా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. కళాశాల పాలక మండలి అధ్యక్షుడు కాత్యాయిని మరిదేవయ్య మాట్లాడుతూ.. అల్లం సుమంగళమ్మ మహిళా స్మారక కళాశాల 1969లో కేవలం 164 మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పుడు 2,500 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉజ్జయిని సమర్థ సింహాసనాధీశుడు జగద్గురు సిద్దలింగ రాజదేశకేంద్ర శివాచార్య భగవత్పాద మహాస్వామి, ఎమ్మిగనూరు గురుమహంతర సంస్థాన పీఠాధిపతి, గురు వామదేవ మహంత శివాచార్య, బళ్లారి ఎంపీ తుకారాం తదితరులు అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో వీవీ సంఘం కార్యదర్శి యాల్పిమేటి పంపనగౌడ, జి.ఎం.పార్వతీశ, ప్రిన్సిపాల్ గోవిందరాజులు, దూపల సతీష్ పాల్గొన్నారు.


