హొసపేటె: కుష్టు వ్యాధిగ్రస్తులకు డామియన్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత శస్త్ర చికిత్స అందిస్తోందని జిల్లా ఆరోగ్యశాఖ (డీహెచ్‌ఓ) డాక్టర్ లింగరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయ ప్రాంగణంలో కుష్టు వ్యాధి నుంచి కోలుకుని వైకల్యంతో బాధపడుతున్న దురుగప్పకు తోపుడు బండి, హనుమక్కకు కుట్టు మిషన్ అందజేశారు. బాధితులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌సీహెచ్‌ఓ డాక్టర్ జంబయ్య, జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్.కె.రాధిక, సీనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ శివప్ప, డామియన్ ఫౌండేషన్ సూపర్‌వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


