రాయచూరు రూరల్: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సేడం తాలూకా విద్యాశాఖ అధికారి మారుతి సూచించారు. శుక్రవారం యాదగిరి జిల్లా గురుమిట్కల్ తాలూకా మోతకపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సర్కారీ హైస్కూల్) ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధులు నిర్వహించే ప్రతి ఉపాధ్యాయుడు పిల్లల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో మహదేవప్ప, టీపీఈఓ సయ్యద్ పటేల్, అక్షర దాసోహ అధికారి ఉమాపతి రాజు, అరవింద్, అశోక్ రెడ్డి, సంతోష్ కుమార్, నారాయణ రెడ్డి, శివశరణప్ప, రాజేంద్ర కుమార్, మహబూబ్ చండ్రకి, బషీర్ అహ్మద్, చెన్నవీరయ్య, వెంకటేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.


