సాక్షి, బళ్లారి: అన్ని దానాలు కన్నా రక్తదానం గొప్పదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని తాళూరు రోడ్డులో ఉన్న గోవిందప్ప కళ్యాణ మంటంలో బీజేపీ నగర మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటికే పలు మార్లు రక్తదానం చేసినట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం మరింత సంతోషంగా ఉందని తెలిపారు. ఆరోగ్యవంతులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. ఆరోగ్యవంతులైన యువతీ, యువకులు రక్తదానం చేయడానికి స్వచ్ఛంధంగా ముందుకు రావాలని సూచించారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని వెల్లడించారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయాలని సూచించారు. పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోది జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. బీజేపీ కార్యాలయంలో శాసన సభ్యుడు శివరాజ పాటిల్ ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. మాజీ శాసన సభ్యుడు శంకరప్ప, నాయకులు గంగాధర నాయక్, చంద్రశేఖర్, యల్లప్ప, నాగరాజ్, సుమతీశాస్త్రి, సంగీత, వాణిశ్రీ పాల్గొన్నారు.


