మా కుటుంబంపై సీఎం డీకే దుష్ప్రచారం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

మా కుటుంబంపై సీఎం డీకే దుష్ప్రచారం చేస్తున్నారు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రెండేళ్లుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉండగా ఏనాడూ అతని వద్ద మొబైల్‌ఫోన్‌ లభించకపోగా రాష్ట్రంలో నైస్‌ వివాదం, కేపీఎస్‌సీ కుంభకోణం వెలుగు చూసినప్పుడే జైల్లో తనిఖీలు చేసి ప్రజ్వల్‌ వద్ద మొబైల్‌ దొరికిందని చెప్పడం చూస్తుంటే ఇదంతా ప్లాన్‌ ప్రకారమే జరిగినట్టుగా ఉందని ఆయన చిన్నాన్న, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. హాసన్‌ జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి దేవేగౌడ కుటుంబాన్ని అంతం చేస్తానన్నది ఈ ముఖ్యమంత్రే అని డీకే శివకుమార్‌పై ధ్వజమెత్తారు. జైల్లో ఉన్న ప్రజ్వల్‌ను రాజకీయాలకు బలి చేస్తున్నారని, చేసిన తప్పుకు ఆ కుర్రాడు కోర్టు తీర్పు మేరకు శిక్ష అనుభవిస్తున్నాడన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే ప్రజ్వల్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. దేవేగౌడ కుటుంబంపై సీఎం దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడమని కుమారస్వామి అన్నారు. ఇటీవల అమెరికాకు వెళ్లిన సమయంలో నైస్‌ సంస్థ కాంట్రాక్టరు, సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఉన్న ఫోటోలను చూశానన్నారు. త్వరలో సంచలనాత్మక అంశాలను బహిర్గతం చేస్తానని హెచ్చరించారు.

మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే గజరాజులకు ముమ్మరంగా తాలీము జరుగుతోంది. ప్యాలెస్‌ నుంచి అంబా విలాస్‌ ప్యాలెస్‌ వరకు రోజూ రెండుసార్లు నడిపిస్తున్నారు. అంత పెద్ద ఏనుగులు బుద్ధిగా వరుసగా వెళ్లడం, రావడం చూసి దేశ విదేశీ పర్యాటకులు సంభ్రమానికి లోనవుతున్నారు.

అతి బరువైన సుగ్రీవ

మొత్తం 14 ఏనుగులకు మరోసారి తూకం వేశారు. ఈసారి సుగ్రీవ అతి పెద్ద గజరాజుగా సత్తా చాటుకుంది. మొదటి బృందంలోని శ్రీకంఠ అనే ఏనుగు 5,770 కేజీల బరువు తూగింది. అంతకన్నా 80 కేజీలు అధికంగా అంటే 5,850 కేజీల బరువుతో సుగ్రీవ ఔరా అనిపించింది. ఆడ ఏనుగుల్లో చైత్ర 3,295 కేజీలు, రూపా 3,260 కేజీల బరువు తూగాయి. సోమవారం గణేష్‌ చతుర్థి కావడంతో ఏనుగులకు గజపూజ చేశారు. విశేష పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌, అటవీ అధికారులు రవిశంకర్‌, ప్రభుగౌడ పాల్గొన్నారు.

జైల్లో ప్రజ్వల్‌ వద్ద మొబైల్‌ వెనుక కుట్ర

కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి

ముమ్మరంగా

గజసాధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement