పాఠశాలకు వస్తున్న విద్యార్థులు
బెంగళూరు ట్రాఫిక్‌తో చదువులకూ ఇబ్బంది
బనశంకరి: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియనిది కాదు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం ఏర్పడి గంటలకొద్దీ చిక్కుకుపోవాలి. దీనివల్ల పాఠశాలలకు ఇబ్బంది లేకుండా బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల సమయంలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. బడుల వేళలు మార్చాలని ఉపాధ్యాయులు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్పకు విన్నవించారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పనిచేస్తున్నాయి. ప్రైవేటు పాఠఽశాలలు ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు పనిచేస్తున్నాయి. గంటన్నర ముందే బడికి బయల్దేరాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం బడుల సమయాలను ఎలా మారుస్తుందన్నది చూడాల్సి ఉంది.
బనశంకరి– సుబ్రమణ్యపుర రోడ్డు పరిశీలన
బెంగళూరు బనశంకరి జంక్షన్‌లో ఏర్పడే వాహనాలు రద్దీ పరిష్కారానికి సుబ్రమణ్యపుర నుంచి బనశంకరి వరకు వచ్చే వాహనాలకు బనశంకరి బీఎంటీసీ బస్ టెర్మినల్ వెనుక భాగంలో ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం కల్పించడం గురించి దక్షిణ నగర పాలికే కమిషనర్ కేఎన్.రమేశ్ పరిశీలించారు. కదిరేనహళ్లి క్రాస్ ద్వారా బనశంకరికి వచ్చే వాహనాల కోసం సుబ్రమణ్యపుర రోడ్డు విస్తరణకు సర్వే చేయాలని అధికారులను సూచించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్‌రెడ్డి, డీసీపీ గోపాల్ బ్యాకోడ్, పాలికే ఇంజనీర్లు పాల్గొన్నారు.
విద్యామంత్రికి ఉపాధ్యాయుల వినతి


