ముగ్గురిని చిదిమిన పాల ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురిని చిదిమిన పాల ట్యాంకర్‌

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని కొప్ప గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఒక పాల ట్యాంకర్‌, బైక్‌ను ఎదురుగా ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో కుటుంబం కడతేరిపోయింది. ముగ్గురు క్షణాల్లో మరణించారు. వివరాలు.. బెంగళూరులో నివసించే ముత్తురాజ్‌ (35), భార్య కావ్య (30), ఎనిమిదేళ్ల కుమార్తె కీర్తన మృతులు. మండ్య వద్ద కొప్ప స్వస్థలమైన ముత్తురాజ్‌ కుటుంబంతో చవితి సెలవుల సందర్భంగా ఊరికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున స్కూటర్‌లో మళ్లీ బెంగళూరుకు ప్రయాణమయ్యారు.

బయల్దేరిన కొంతసేపటికే

కొప్ప గ్రామం వద్ద హైవేలో ప్రయాణిస్తుండగా, అతివేగంగా వస్తున్న పాల ట్యాంకర్‌ వారి స్కూటర్‌ను ఢీకొనింది. దీంతో రోడ్డు పక్కకు దూరంగా ఎగిరిపడ్డారు. దంపతులు, బాలిక కీర్తన రక్తపు మడుగులో మరణించారు. ఇంటి నుంచి బయల్దేరిన కొంతసేపటికే ముగ్గురూ మృత్యుఒడికి చేరుకున్నారు. వారి మరో కూతురు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. కొప్ప ఎస్‌ఐ ఉమేష్‌, పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మిమ్స్‌కి తరలించారు. ట్యాంకర్‌ డ్రైవరుపై కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి బంధువులు, గ్రామస్తులు తరలివచ్చారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మండ్య వద్ద స్కూటర్‌ను ఢీ

తల్లిదండ్రులు, కుమార్తె దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement