అరణ్య సంపదకు రక్షకులు మీరే | - | Sakshi
Sakshi News home page

అరణ్య సంపదకు రక్షకులు మీరే

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

శివాజీనగర: దేశ అటవీ సంపదను కాపాడేది మీరే. వన్యప్రాణులతో ఘర్షణల కారణంగా చాలా మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శాఖ సిబ్బంది భత్యాలపై మంత్రి అభ్యర్థనను పరిశీలిస్తాం. ఆర్థిక శాఖతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం అని సీఎం డీ.కే.శివకుమార్‌ అన్నారు. మల్లేశ్వరంలోని ఫారెస్ట్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాకు అడవితో చాలా సన్నిహిత సంబంధం ఉంది. మా గ్రామం, ఇల్లు, పొలం పనులు అన్నీ అడవితో ముడిపడి ఉన్నాయన్నారు.

అభివృద్ధి పనులకు అడ్డుపడకూడదు

సామాన్య ప్రజలు పోలీసులను అంగీకరిస్తారు. వారు అటవీ శాఖ సిబ్బందిని అంగీకరించరు. అటవీ శివార్లలోని ప్రజలతో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించండి. అటవీ ఆక్రమణలను చట్ట ప్రకారం పరిష్కరిద్దాం. ప్రజలను ఒత్తిడి చేయవద్దు. అటవీ శాఖ అధికారులు అభివృద్ధి పనులకు అడ్డు రాకూడదు. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆయన అన్నారు.

అక్రమ ఆయుధాలను అప్పగించండి

లైసెన్స్‌ లేకుండా అక్రమంగా కలిగి ఉన్న ఆయుధాలను నవంబర్‌ 1వ తేదీలోగా ప్రభుత్వానికి అప్పగించాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. అటవీ అధికారులు టేకు సిరి ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేయాలన్నారు. కస్తూరి రంగన్‌ నివేదిక అమలులో తమకొక న్యాయం, కేరళకు ఒక న్యాయం కల్పించిన ఈ విషయంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

జీతభత్యాల పెంపుపై ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయిస్తాం

అటవీ అమరవీరుల దినోత్సవంలో సీఎం డీ.కే.శివకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement