అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకారం | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకారం

Sep 9 2026 12:05 AM | Updated on Sep 9 2026 12:05 AM

రాయచూరు రూరల్‌: లింగసూగూరు అసిస్టెంట్‌ కమిషనర్‌గా నాగేంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఏసీ కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, రైతుల సహకారంతో లింగసూగూరు డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దాఖలాలు, ఖాతాల మార్పిడి తదితర పనులను సత్వరం పూర్తి చేస్తామన్నారు.

నేత్రపర్వంగా రథోత్సవం

రాయచూరు రూరల్‌: బాగల్‌కోటె జిల్లా హునగుంద తాలూకా ఇలకల్‌లో విజయ మహంతేష్‌ స్వామీజీ రథోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రథోత్సవంలో రాయచూరు, కొప్పళ, విజయపుర, గదగ్‌, బళ్లారి, హుబ్లీ ధార్వాడల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నిరక్షరాస్యత నిర్మూలిద్దాం

రాయచూరు రూరల్‌: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేద్దామని జెడ్పీ ప్రణాళికాధికారి రోణ అన్నారు. మంగళవారం జెడ్పీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. భూమిలో పడిన విత్తనం, మనిషిని చేరిన అక్షరం ఎక్కడికీ వెళ్లదన్నారు. హత్తి, ఈరణ్ణ, శివమ్మ, దండెప్ప, సదానంద పూజారి, గిరియప్పలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement