బనశంకరి: బెంగళూరు నగరంలో రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి నగర పోలీసులు గత 24 గంటల్లో 1,352 మంది రౌడీషీటర్ల ఇళ్లపై దాడులు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి సోదాలు చేపట్టారు. కొందరి ఇళ్లలో పెద్ద కత్తులు, కొడవళ్లు స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. జీబీఏ ఎన్నికలు సమీపిస్తుండడంతో అశాంతి, గూండాగిరి, ఓటర్లకు బెదిరింపులకు పాల్పడే ఘటనలు జరగకుండా ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని కట్టడి చేయాలని రౌడీలు, గూండాల ఆదాయమార్గాలు, ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పోలీసుల దాడితో రౌడీషీటర్లులో గుబులు మొదలైంది. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే నగర బహిష్కరణ లేదా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ప్రతిభావంతులకు సన్మానం
బనశంకరి: బెంగళూరు నిజమైన ఆస్తి ప్రతిభావంత యువకులు. వారే భవిష్యత్ దారి దీపమని నగరాభివృద్ధి శాఖా మంత్రి కృష్ణబైరేగౌడ అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శనివారం టౌన్‌హాల్‌లో ప్రతిభావంత విద్యార్థులకు సన్మానం జరిగింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన 181 మంది విద్యార్థులను సన్మానించారు. లక్ష్యం చేరుకోవడానికి కష్టపడి చదవాలన్నారు.


