కరువు లేదా?
తుమకూరు: రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా గోడెకెరె గేట్ వద్ద జరిగింది. మృతులను చిక్కనాయకనహళ్లి నివాసులు అనిల్ (32), వివేక్ (31), తురువేకెరె నివాసులు దావూద్ పాషా (45). అనమ్ పాషా (3)గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం తుమకూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కేబీ క్రాస్ వైపు నుంచి వస్తున్న కారులో ఉన్న చిక్కనాయకనహళ్లి పట్టణానికి చెందిన వివేక్, అనిల్ తురువేకెరెకు వెళుతున్నారు. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతినగా ఒక్కో కారులో ఇద్దరు చొప్పున చనిపోయారు. చిక్కనాయకనహళ్లికి చెందిన తాతయ్య, తురువేకెరెకు చెందిన యాసీన్ తాజ్, సీమా, ఆస్మా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ గోపాల్, ఎమ్మెల్యే సీబీ సురేష్‌బాబు, తహసీల్దార్ మమత పరిశీలించారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
తుమకూరు జిల్లాలో ప్రమాదం


