గురు రాఘవేంద్రులకు పాలాభిషేకం చేస్తున్న అర్చకులు
రాఘవేంద్రస్వామి సన్నిధిలో భక్తజనం
బనశంకరి: శ్రావణమాస శనివారం సందర్భంగా ఆలయాలలో విశేష పూజా వేడుకలు జరిపించారు. బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లోని శ్రీ గురురాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా రాఘవుల బృందావనానికి 108 లీటర్ల పాలతో క్షీరాభిషేకం గావించారు. ఫల పంచామృత అభిషేకం, స్వర్ణ సింహాసనానికి పుష్ప అలంకరణ. గురురాయర పాదపూజ చేపట్టారు. ఆర్‌కే.వాదీంద్ర ఆచార్య నేతృత్వంలో ఆలయ అర్చకులు పూజా కై ంకర్యాలను నిర్వహించారు. ఎంపీ సుధామూర్తి, పెద్దసంఖ్యలో భక్తజనం బృందావనాన్ని దర్శించుకుని పూజలు చేశారు.
వసంత వల్లభునికి..
బనశంకరి: బెంగళూరులో వసంతపురలో వెలసిన వసంతవల్లభ రాయస్వామి సన్నిధిలో శ్రావణమాస శనివారం పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ ప్రత్యేక అభిషేకం, చేపట్టి విశేషంగా అలంకరించారు. 11 గంటలకు ఉత్సవమూర్తులను భాజభజంత్రీలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. భారీగా భక్తులు దర్శించుకున్నారు.
108 లీటర్ల పాలతో అభిషేకం


