మచిలీపట్నం– శివమొగ్గ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

మచిలీపట్నం– శివమొగ్గ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

శివమొగ్గ: ప్రయాణికుల రద్దీ ఉండడంతో దక్షిణ కోస్తా రైల్వే విభాగం ఏపీలోని మచిలీపట్నం–శివమొగ్గ టౌన్‌, శివమొగ్గ టౌన్‌–గుంతకల్‌ మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి, 07217/ 07218 నంబరు రైలు మచిలీపట్నం–శివమొగ్గ మధ్య సంచరిస్తుంది. మార్గమధ్యంలో గుడివాడ జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, గుంటూరు జంక్షన్‌, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్‌, కంబం, గిద్దలూరు, నంద్యాల జంక్షన్‌, బేతంచెర్ల, డోన్‌ జంక్షన్‌, గుత్తి జంక్షన్‌, అనంతపురం, ధర్మవరం జంక్షన్‌, పుట్టపర్తి, హిందూపురం తదితర స్టేషన్లలో నిలుస్తుంది. తుమకూరు, తిపటూరు, అరసికెరె, బీరూర్‌ జంక్షన్‌, తరికెరె, భద్రావతి మీదుగా శివమొగ్గకు చేరుతుంది.

శివమొగ్గ టు గుంతకల్‌

అలాగే 07219/ 07220 నంబరు ఎక్స్‌ప్రెస్‌ బండి శివమొగ్గ టౌన్‌–గుంతకల్‌–శివమొగ్గ టౌన్‌ మధ్య నడుస్తుంది. భద్రావతి, తరికెరె, బీరూర్‌ జంక్షన్‌, అరసికెరె జంక్షన్‌, తిపటూరు తుమకూరు, యలహంక జంక్షన్‌, హిందూపూర్‌, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్‌, అనంతపురం, గుత్తి స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 1 ఏసీ ఫస్ట్‌ క్లాస్‌, 1 ఏసీ 2–టైర్‌, 2 ఏసీ 3–టైర్‌, 9 స్లీపర్‌ క్లాస్‌, 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 సెకండ్‌ క్లాస్‌ లగేజ్‌ కమ్‌ బ్రేక్‌ వ్యాన్‌లతో సహా మొత్తం 20 కోచ్‌లు ఉంటాయని రైల్వేవర్గాలు తెలిపాయి.

శివమొగ్గ నుంచి గుంతకల్లుకు

కూడా సర్వీసు

రైలు ప్రయాణికులకు వెసులుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement