దొడ్డగుర్కి వెంకటేశ్వరస్వామివారు చిక్క తిరుపతిలో
సుందరంగా వసంత వల్లభుడు
బనశంకరి: బెంగళూరులో తిరుమల తరువాత అంత పేరుగల వసంతపుర వసంతవల్లభ రాయస్వామి ఆలయంలో శ్రావణమాస సందడి నెలకొంది. ఉత్తరహళ్లి సమీపంలోని వసంతపురలో వసంత వల్లభరాయస్వామి ఆలయంలో రెండో శ్రావణ శనివారం సందర్భంగా అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ స్వామి మూలవిరాట్‌కు అభిషేకం, అర్చనలు చేసి అలంకరణ గావించారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో మేళాతాళాలతో ఉరేగించి మహా మంగళహారతి పట్టారు. భక్తులు భారీగా వచ్చి వైకుంఠవాసున్ని దర్శించుకుని పునీతులయ్యారు.
ఏడుకొండలవాడా... గోవిందా
కోలారు: ముళబాగిలు తాలూకా దొడ్డగుర్కి గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తజనం తరలివచ్చారు. అర్చకులు భద్రినాథ్ ఉదయమే మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, అలంకారం, మంగళహారతి సేవలను నిర్వహించారు. ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు.
చిక్క తిరుపతిలో
మాలూరు తాలూకా చిక్క తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో శ్రావణ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించారు. ఏడుకొండలస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
విశేషంగా శ్రావణ పూజలు


