రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణి అనే గ్రామంలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని వారు అవలోకించారు. అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమస్యలు ఉద్భవించినప్పుడు పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి సర్కార్ నుంచి పరిహారంతో పాటు న్యాయం లభించేలా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ హంపన్న, ఏఎస్పీ హరీష్, డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, సీఐ కెంచారెడ్డిలున్నారు.


