బనశంకరి: రాష్ట్రంలో అన్ని పోలీస్‌స్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాలు రోజులో 24 గంటలూ ఆన్‌లో ఉండాలని, ఒక్క నిమిషం కూడా ఆఫ్ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్‌లో గత 11 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయడంలేదని పోలీసులు చెప్పడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది శాఖపై నమ్మకాన్ని తగ్గిస్తుందన్నారు. రామమూర్తి నగరవాసి వి.శైలజ అనే మహిళ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ విచారించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఠాణాలలో కచ్చితంగా సీసీ కెమెరాలు పనిచేస్తుండాలని, ప్రసారాలను పరిశీలిస్తుండాలని పోలీసుశాఖను ఆదేశించారు.
నిరంతర పర్యవేక్షణ
చాలా పోలీస్‌స్టేషన్లలో సుమారు 4 దాకా సీసీ కెమెరాలున్నాయి, యుపీఎస్ విద్యుత్ వ్యవస్థ లోపాలున్నాయి. చాలా కెమెరాలు పనిచేయకపోవడం దిగ్భ్రాంతికరం. కరెంటు పోయినప్పుడు బ్యాటరీ వ్యవస్థ లేక కెమెరాలు ఆఫ్ అవుతున్నాయి, దీనివల్ల లక్ష్యం దెబ్బతింటోంది. ఠాణాల్లో కార్యకలాపాల నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉండాలి అని జడ్జి స్పష్టంచేశారు. హోంశాఖ, డీజీపీ తదితరులు దీనిపై దృష్టి సారించాలన్నారు. వైట్‌ఫీల్డ్ ఠాణాలో 11 నెలలు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సరికాదన్నారు.
ఆఫ్ చేయడం సబబు కాదు
హైకోర్టు తీవ్ర అసంతృప్తి


