లైంగిక దాడియత్నం.. పూజారిపై కేసు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడియత్నం.. పూజారిపై కేసు

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

రాయచూరు రూరల్‌: బాలికపై లైంగిక దాడికి యత్నించిన పూజారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. యాదగిరి తాలూకా సక్రెనాయక్‌ తాండాలో భాగ్యవంతి మఠం పూజారి అణ్ణప్ప సురపుర తాలూకాలోని కుగ్రామంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి సహకరించాలని ఒత్తిడి తేవడంతో మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్‌ శరణమ్మ ఫిర్యాదు మేరకు యాదగిరి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రికి మద్దతుగా ధర్నా

కోలారు: మంత్రి నాగేంద్ర రాజీనామా చేయరాదని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం కార్యకర్తలు శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబరీష్‌ మాట్లాడుతూ ఆయనపై ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దోషిగా ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు. అందువల్ల మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. మైలాండహళ్లి మురళి, మాలూరు వెంకటరాం, నరేష్‌, భైరాండహళ్లి నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement