ఎడమ కాలువలో నీటి గేజ్‌ కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ఎడమ కాలువలో నీటి గేజ్‌ కాపాడాలి

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందాలంటే నీటి గేజ్‌ను కాపాడాలని మాజీ మంత్రి, విధాన పరిషత్‌ సభ్యుడు బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌ తెలిపారు. శనివారం సిరవార ఐబీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. 69వ మైల్‌ వద్ద నీటి నిర్వహణ గేజ్‌్‌ సామర్థ్యాన్ని గురించి జిల్లాధికారికి వివరించి ఆయకట్టు చివరి భూములకు నీరందించాలని అధికారులతో చర్చిస్తామన్నారు. గేజ్‌ నిర్వహణలో జరిగిన లోపంతో కింది భాగానికి నీరందడం కష్టమైందన్నారు. పైభాగంలో సాగులో ఉన్న సుమారు 2 లక్షల వరకు అక్రమ నాన్‌ ఆయకట్టును తొలగిస్తే ఆయకట్టు చివరి భూముులకు నీరు అందుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement