‘శ్రావణ’ శనివార పూజలు | - | Sakshi
Sakshi News home page

‘శ్రావణ’ శనివార పూజలు

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

బళ్లారిఅర్బన్‌: శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా నగరంలోని వివిధ సీతారామాంజనేయ స్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో విశేష అలంకరణలు, పూజలను నిర్వహించారు. తెల్లవారు జామున స్వామి వారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. నగరంలోని అనంతపురం రోడ్డు అభయ వరద ఆంజనేయ స్వామి ఆలయం, మిల్లర్‌పేట్‌ ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు రోడ్డు బాలాంజనేయ స్వామి ఆలయం, నాగుల చెరువు వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీరాంపురం కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, హవంబావి కోదండ రామాలయం, కాకర్లతోట ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు నగరంలోని పలు సీతారామాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. భక్తుల ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయాలు సందడిగా మారాయి.

ఆంజనేయ స్వామి విగ్రహాలకు

ప్రత్యేక అలంకరణలు

దర్శనానికి పెద్ద సంఖ్యలో

ఆలయాలకు తరలి వచ్చిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement