రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నిష్పక్షపాతంగా కేసు విచారణ చేపట్టాలని ఏఐఎంఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు.
నిందితుల అరెస్ట్‌కు డిమాండ్
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో గురువారం దళిత యువతి అశ్వినిపై అత్యాచారానికి పాల్పడి శవాన్ని బావిలో పడేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బీఎస్పీ అధ్యక్షుడు జైభీమ్ వల్లభ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అశ్విని మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టేంత వరకు ఆందోళన చేపడతామన్నారు. జిల్లాలో నెల రోజుల్లోనే ముగ్గురు దళిత వర్గానికి చెందిన వారు హత్యలకు గురయ్యారన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో బేరి, బసవరాజ్, ఉరుకుందప్పలున్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయచూరు రూరల్: మానవుడికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయిని తారానాథ్ విద్యా సంస్థల అధ్యక్షుడు పవన్ కుమార్ సుఖాణి పేర్కొన్నారు. శనివారం ఎల్‌వీడీ కళాశాల మైదానంలో అంతర్ కళాశాల క్రికెట్, వాలీబాల్ టోర్నీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో అంబాపతి, శరణేగౌడ, ఆంజనేయ, హుసేనప్ప, చక్రధర్, మల్లేష్, సంపత్, మంజునాథ్‌లున్నారు.
డిసెంబర్‌లో వర్కింగ్
జర్నలిస్టుల సమ్మేళనం
రాయచూరు రూరల్: 2026 డిెసెంబర్‌లో రాయచూరులో 41వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులో రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్‌సింగ్‌తో ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలోని పాత్రికేయులు ఐకమత్యంతో సమ్మేళనం విజయవంతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే ప్రతినిధులకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో రాయచూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, లక్ష్మణ్, సిద్దయ్య స్వామి, రామకృష్ణ, విశ్వనాథ్, బసవరాజ్, శివరాజ్‌లున్నారు.


