హొసపేటె: మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నగరంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నా సందర్భంగా శుక్రవారం బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. గత ఐదు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక నిరసన సాగుతోంది. అయితే శుక్రవారం హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు మీదకు రావడంతో వారు రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు వ్యతిరేకత మధ్య కొందరు కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టాలని నిర్ణయించారు. కానీ అంతలోపే పోలీసులు నాలుగు వాహనాల్లో వచ్చి నిరసనకారులను అరెస్ట్ చేశారు. నిరసనకారులు ప్రభుత్వానికి, మంత్రి నాగేంద్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాగేంద్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, జిల్లా కో–ఇన్‌చార్జి చెన్నబసవనగౌడ పాటిల్, జిల్లా యువజన అధ్యక్షుడు కిచిడి కొట్రేశ్, నాయకులు అయ్యాళి తిమ్మప్ప, కేఎస్.రఘు తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు


