హుబ్లీ: తాలూకాలోని ఛబ్బి గ్రామంలో భగవాన్ శాంతినాథ జైన సమాజం ఆధ్వర్యంలో చాతుర్మాస ధర్మసభను రాష్ట్ర చక్కెర, జౌళి శాఖ మంత్రి రుద్రప్ప లమాణి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జైన మతం ప్రపంచానికి ఆదర్శం అన్నారు. జైన మునులు పాటించే కఠిన వ్రతాలు, తత్వ సిద్ధాంతాలు, అహింసా మార్గాన్ని నేటి సమాజం అనుసరించాలన్నారు. బాలాచార్య డాక్టర్ సిద్దసేన ముని మహారాజ్ భక్తులనుద్దేశించి మాట్లాడారు. వివిధ గ్రామాల మహిళలు పాల్గొని భజన గీతాలను ఆలపించారు. విమల తాళికోటె, విజయ, దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సౌకర్యాలు కల్పించండి
రాయచూరు రూరల్: జిల్లా ప్రజలకు విద్యా, వైద్య మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి డిమాండ్ చేశారు. విధాన పరిషత్ సమావేశాల్లో ఆయన స్పీకర్‌కు విన్నవిస్తూ సింధనూరుకు ఇంజనీరింగ్ కళాశాల, మొరార్జి దేశాయి పాఠశాలలను మంజూరు చేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.


