బీఎంసీఆర్‌సీ అధికార పీఠం ఎవరిదో? | - | Sakshi
Sakshi News home page

బీఎంసీఆర్‌సీ అధికార పీఠం ఎవరిదో?

Aug 19 2026 12:54 AM | Updated on Aug 19 2026 12:54 AM

బళ్లారి రూరల్‌: బళ్లారిలో పెద్దాసుపత్రిగా పేరొందిన బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్ర ం(బీఎంసీఆర్‌సీ) డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ పోస్టు కోసం మొదటి నుంచీ తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఈ పోస్టును సీనియర్‌ వైద్యులు అధికార, ధనబలం, పరపతిని ఒడ్డి చేజిక్కించుకొనేవారు. పర్మనెంట్‌ పోస్టు దక్కకపోయినా ఇంచార్జ్‌గానైనా కొనసాగితే చాలని వైద్యులు ప్రయత్నించేవారు. ఒకరిద్దరు సీనియర్‌ వైద్యులు ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లుగా కొనసాగారు. బీఎంసీఆర్‌సీ అప్‌గ్రేడ్‌ కాక ముందు విమ్స్‌గా ఉన్నప్పుడు 2022 ఆగస్టులో డాక్టర్‌ గంగాధరగౌడ పర్మనెంట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు డైరెక్టర్‌ పదవి కాలపరిమితి మూడేళ్లు కాగా 2022 నుంచి నాలుగేళ్లకు పెంచారు. ఈ నెలతో డైరెక్టర్‌ పదవి కాల పరిమితి ముగుస్తుంది. తదుపరి కొత్త డీన్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఎవరన్నది బీఎంసీఆర్‌సీలో చర్చనీయాంశంగా మారింది.

కొనసాగింపునకు ప్రస్తుత డీన్‌ యత్నం

అయితే ఇప్పుడు డీన్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ గంగాధరగౌడ మరో ఆరు నెలలు తనను కొనసాగించాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖాధికారులను కోరినట్లు సమాచారం. ఆ దిశగా రాజకీయ పలుబడిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అయితే డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ పదవికి కాలపరిమితి ఈ నెల 18తో ముగుస్తుండటంతో కొత్త డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ కోసం ఇద్దరు సీనియర్‌ వైద్యులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్‌ గంగాధరగౌడ అభ్యర్థనను రాష్ట్ర వైద్యవిద్యా ఽశాఖ సమ్మతిస్తే మరి కొంతకాలం డీన్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగుతారు. లేకపోతే కొత్త డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ పదవి కోసం ఆ శాఖ ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తుంది.

బీఎంసీఆర్‌సీ ఆసుపత్రి భవనం(ఫైల్‌)

డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ పాలనా సముదాయ కార్యాలయం

ఈ నెల 18తో ముగియనున్న

డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ పదవీ కాలమితి

డీన్‌ పదవికి ఇద్దరు సీనియర్‌

వైద్యుల ముమ్మర ప్రయత్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement