చూడముచ్చటగా పూల రూపాలు
గంగ రాజుల సామ్రాజ్య పుష్ప థీమ్
బనశంకరి: స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఉద్యాననగరిలో లాల్‌బాగ్ పార్కులో గురువారం ఫల పుష్ప ప్రదర్శనను సీఎం డీకే.శివకుమార్ ప్రారంబించారు. ప్రాచీన కన్నడ చక్రవర్తుల గంగ రాజుల సామ్రాజ్య వైభవం, చరిత్ర, కళలు, వాస్తుశిల్పాలకు అద్దం పట్టే థీమ్‌తో ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన 130 కి పైగా అపురూపమైన పుష్పాల రాశులతో ఆకృతులను తీర్చిదిద్దారు. లాల్‌బాగ్ చెరువు వద్ద కృత్రిమ జలపాతం, సెల్ఫీ పాయింట్ ఏర్పాటయ్యాయి. సీఎం డీకే మాట్లాడుతూ... చరిత్రను పుష్పాల ద్వారా ప్రజలకు పరిచయం చేయడమే ఈ షో ఉద్దేశమన్నారు. పూల రూపాలను వీక్షిస్తూ సీఎం పోజులిచ్చారు. మొదటిరోజే పెద్దసంఖ్యలో జనం పుష్పందాలను తిలకించి తన్మయులయ్యారు. ఉద్యానశాఖ అధికారులు మాట్లాడుతూ శ్రావణ బెళగొళ బాహుబలి విగ్రహం, తలకాడు శిల్పకళా మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు.
లాల్‌బాగ్‌లో స్వాతంత్య్ర ఫల పుష్ప ప్రదర్శన
ప్రారంభించిన సీఎం డీకే
ప్రాచీన కన్నడ చరిత్రకు దర్పణం


