ఒకే చెట్టుకు నేపాల్‌ యువతుల ఆత్మహత్య! | - | Sakshi
Sakshi News home page

ఒకే చెట్టుకు నేపాల్‌ యువతుల ఆత్మహత్య!

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

దొడ్డబళ్లాపురం: ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చారు. కానీ ఏం సంకటం వచ్చిందో ఇద్దరు యువతులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో యలహంక దగ్గర జక్కూరులో వెలుగు చూసింది. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లినవారు చూసి కంగుతిన్నారు. జక్కూరులోని కృష్ణ రెస్టారెంట్‌ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన వాకర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యలహంక పోలీసులు మృతులను నేపాల్‌కు చెందిన సిర్జనా (22), రితా (23)గా గుర్తించారు.

దొరకని వివరాలు

వీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఏం పనిచేసేవారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. అనే విషయాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నిజంగా ఆత్మహత్య, లేక మరేదైనా జరిగిందా? అనే అనుమానాలున్నాయి, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

బెంగళూరులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement