భక్తిశ్రద్ధలతో సీతా పండుగ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సీతా పండుగ

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

హొసపేటె: అమావాస్య మరుసటి రోజు తాలూకాతో సహా విజయనగర జిల్లా వ్యాప్తంగా బంజారా(లంబాణి) సమాజం సీతా పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. సమాజ సభ్యులు ప్రాణాంతక వ్యాధులు, రుగ్మతలు తొలగిపోవాలని, సంపద, ధాన్యం సమృద్ధిగా లభించాలని, ప్రజల జీవితాలు సుఖశాంతులతో నిండిపోవాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగ కోసం గ్రామం వెలుపల ఒక వేప చెట్టు మొదలు వద్ద తుళజా భవాని, ఇంగల భవాని, భవానిలతో సహా ఏడుగురు తల్లులకు ప్రతీకగా నిలిచే దేవతా విగ్రహాలను ప్రతిష్టించారు.

ఆచారం ప్రకారం పూజలు

ఆ చెట్టు ఏడు కొమ్మలకు లేదా ఏడు రాళ్లకు కుంకుమ సమర్పించడం ఈ పండుగ ప్రధాన ఆచారం. దేవతా విగ్రహాల వెనుక ఒక లూకాడ్‌(సేవకుడు) విగ్రహాన్ని ఉంచి పూజించారు. అనంతరం భక్తులు లూకాడ్‌కు రక్తాభిషేకం చేసి, తల్లులకు తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. పల్లెల్లో సీతా పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పండుగ కారణంగా లంబాణి తాండాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

లంబాణి తాండాల్లో పండుగ వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement