బళ్లారి అర్బన్: సేవా భారతి ట్రస్ట్, జాగృతి మహిళా స్వావలంబన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో 2026 వార్షికోత్సవం ఆదివారం బళ్లారిలోని బాల భారతీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని గాలి లక్ష్మీ అరుణ ప్రారంభించి మాట్లాడారు. నారీ శక్తియే దేశ శక్తి అని పేర్కొన్నారు. మహిళల సాధికారత, విద్య, స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. అనంతరం కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మురారి, ప్రసన్నజీ, డాక్టర్.తిప్పారెడ్డి, డాక్టర్.రేణుకా మంజునాథ్, కార్యదర్శి శరణ్ కుమార్ ఎస్‌ఆర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో బైకిస్ట్ మృతి
హుబ్లీ: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆ బైకిస్ట్ స్థలంలోనే మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా మారడిగి గ్రామంలో చోటు చేసుకుంది. మారడిగి శేఖప్ప, బసప్ప (80) మృతుడు. హెబ్బళ్లి రోడ్డు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకొని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శేఖప్ప అక్కడి మృతి చెందాడు. ధార్వాడ గ్రామీణ ఎస్‌ఐ ప్రవీణ కోటి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


