హొసపేటె: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్థానిక కరుణాడ క్రియగల శీల సమితి కార్యవర్గ సభ్యులు ఆదివారం నగర శివారులోని జోల రాశి కొండపై వర్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. మొక్కజొన్న కుప్పపై ఆవు పేడ దుప్పటి వేసి.. వరుణ దేవా కురుణించవా అంటూ ప్రార్థించారు. కరుణాడ కలిగల శీల సమితి అధ్యక్షుడు పి.వి.వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలు కురువాలని ప్రార్థించడం జరిగిందన్నారు. నగరంలోని సన్నక్కి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, జొల్ల రాశి కొండపై ఉన్న గోరవయ్య కొండను ఎక్కి పూజలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గుజ్జల గణేష్, రాష్ట్ర రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు గంటా సోమశేఖర్, నాయకులు, జి.నీలకంఠ, బి.పంపాపతి నాయక్, గుండి రమేష్, హనుమంతప్ప, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.


