పురుషులకే ఎక్కువ ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పురుషులకే ఎక్కువ ప్రమాదం

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

● ఊబకాయం కనిపించిన వెంటనే మధుమేహం, అధిక బీపీ వంటివి అనుసరిస్తాయి. ఇవి మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి.

● కన్నడనాట 2023–24లో పురుషుల్లో మధుమేహం కేసులు 7.6 శాతం నుంచి 17.8 శాతానికి పెరిగితే, మహిళల్లో 6.8 శాతం నుంచి 14.8 శాతానికి పెరిగింది.

● చక్కెర వ్యాధికి మందులు వాడుతున్న పురుషులు 29.7 శాతమైతే, మహిళల్లో ఇది 25 నుంచి 27.8 శాతంగా ఉంది.

● అలాగే హై బీపీ కూడా పురుషులనే వేధిస్తోంది. నగరాల్లో 32.4 శాతం పురుషుల్లో బీపీ ఉంటే, మహిళల్లో 27.8 శాతంగా ఉంది.

నిత్యం వ్యాయామంతో

ఆరోగ్యానికి పునాది

ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏనాడో చెప్పారు. ఎంత సంపద ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే చేయగలిగిందేమీ ఉండదు. అన్నీ యాప్‌ల ద్వారా జరిగిపోతున్న ఈ డిజిటల్‌ యుగంలో నడక, వ్యాయామం సహా ఆరోగ్య సంరక్షణకు సమయం ఉండడం లేదు. దీంతో రోగాల దాడులు అధికమయ్యాయి.

సాక్షి, బెంగళూరు: ఆధునిక జీవనశైలిలో సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గింది. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు మారాయి. దీంతో చిన్న వయసులోనే వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు సతమతం చేస్తున్నాయి. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి జబ్బులు సాధారణమవుతున్నాయి. వాటి బారినపడినవారు నిత్యం మాత్రలు మింగుతూ బతుకీడ్చాలి.

పల్లెల్లో సైతం

కర్ణాటకవ్యాప్తంగా చాలామంది మధుమేహం, రక్తపీడనం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవడంతో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపీడనం వంటి వాటితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా ఇలాంటి అనారోగ్యాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే –6 నివేదికలో ఈ భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి. సర్వే ప్రకారం బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బెళగావి వంటి నగరాలు, వాటి చుట్టుపక్కల గ్రామాల్లో ఫిట్‌నెస్‌ కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఆరోగ్య జాగృతి కల్పిస్తున్నా ఊబకాయం, అసాంక్రమిక రోగాలు ప్రబలుతున్నాయి. ఇక పల్లెల్లో ఇప్పటికీ పౌష్టిక ఆహారం దొరకడం కష్టంగా ఉంది.

మహిళలకు స్థూలకాయం సమస్య

● నగర ప్రాంతాల్లో మహిళల్లో సగం మంది అంటే.. 51.7 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో 33 శాతం మంది అధిక బరువుతో ఉన్నారు.

● రాష్ట్ర మహిళల్లో స్థూలకాయం శాతం గత సర్వేలో 30.2 శాతంగా ఉండగా, తాజా సమీక్ష–6లో 41.2 శాతానికి పెరగడం గమనార్హం.

● పురుషుల్లో స్థూలకాయం సమస్య 30.9 శాతం నుంచి 36.4 శాతానికి పెరిగింది.

● ఇక పల్లెల్లో 18.6 శాతం మంది మహిళలు, 18.4 శాతం మంది పురుషులు మామూలు కంటే తక్కువ బరువున్నారు. పౌష్టికాహార లోపమే దీనికి కారణం. మొత్తం మహిళల్లో 15.1 శాతం, పురుషుల్లో 14 శాతం అపౌష్టికత ఉన్నట్లు తేలింది.

అనారోగ్యాలకు పలు కారణాలు..

● వేపుళ్లు, జంక్‌ఫుడ్‌, శీతల పానీయాల అధిక వినియోగం

● పనిభారం, మానసిక ఒత్తిడికి గురికావడం

● అధిక బరువు, మద్యపానం, ధూమపానం

● వ్యాయాయం చేయకపోవడం

బీపీ, షుగర్‌తో ఇబ్బంది

రాష్ట్రంలో షుగర్‌, బీపీ,

క్యాన్సర్‌ జబ్బుల బెడద

వెంటాడుతున్న ఊబకాయం

ఆధునిక జీవనశైలితో పెను ముప్పు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement