ఇది రాజకీయ చదరంగం | - | Sakshi
Sakshi News home page

ఇది రాజకీయ చదరంగం

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

బనశంకరి: రాజకీయ చదరంగం ఆడేటప్పుడు ఏమి చేస్తారో ఎవరూ చెప్పరు.. అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ అన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేడీఎస్‌ అదనపు అభ్యర్థిని నిలపడాన్ని ప్రస్తావించగా ఇది రాజకీయ చదరంగమని, తమ ఆటను ఎవరూ బయటకు చెప్పరని సమాధానమిచ్చారు. దళపతి దేవేగౌడకు రాజ్యసభ టికెట్‌ ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని సుర్జేవాలా విమర్శించారని చెప్పగా, దీనిపై తానేమీ మాట్లాడను, సుర్జేవాలానే మాట్లాడతారని చెప్పారు.

మంత్రులకు గదుల కేటాయింపు

డీకే కేబినెట్‌లోని 13 మంది మంత్రులకు గదులను కేటాయించారు. విధానసౌధ, వికాససౌధలో మంత్రులకు గదులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జల వనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డికి 335, 336, 337, 337ఏ గదులను కేటాయించారు. గతంలో డీసీఎంగా డీకే.శివకుమార్‌ వినియోగించిన గదులకు మరమ్మతులు చేసి రామలింగారెడ్డికి కేటాయించడం గమనార్హం.

సీఎంకు కుమారకృప

కుమారకృపా అతిథి గృహం ఇకపై ముఖ్యమంత్రి నివాసం కార్యాలయం కానుంది. ప్రస్తుతం ప్రధాన ముఖద్వారం తూర్పు భాగంలో ఉంది. ఆ ద్వారాన్ని మార్చారు. సీఎం డీకే ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తారు.

సీఎం డీకే శివ వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement