కొత్త ఇల్లు, చదువు, ఉద్యోగం..
అయ్యారే.. ఐహోళె
ఆశతో జీవిస్తున్నా: డీసీఎం
బనశంకరి: ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో పార్టీ హైకమాండ్ నేతలు తనను నిరాశపరచరు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడారు. సీఎం మార్పిడిపై నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆశతో బతుకుతున్నానని, శ్రమకు ఎప్పుడైనా ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తమ నేతలు కచ్చితంగా తనను నిరాశపరచరనే విశ్వాసం ఉందని తెలిపారు. సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు కావాలి కదా? అని ప్రశ్నించగా, కేపీసీసీ అధ్యక్షునిగా నాకు పార్టీ 140 మంది ఎమ్మెల్యేల అండ ఉంది, నంబరు గురించి సమస్య లేదు, సిద్దరామయ్యకు, నాకు ఎమ్మెల్యేలు అందరి మద్దతు ఉంది. మేమిద్దరం కూర్చుని చర్చించామని, అన్నింటినీ హైకమాండ్ నేతల తీర్మానానికి వదిలిపెట్టాం. వారు తీసుకునే నిర్ణయానికి నేను, సిద్దరామయ్య కట్టుబడి ఉంటామని ఇప్పటికే తెలియజేశామని డీకే అన్నారు.
దొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతుండగా పాత రాగి కలశంలో 466 గ్రాముల బంగారు ఆభరణాలు దొరకడం దేశమంతటా సంచలనం కలిగిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్కుండిలో చారిత్రక ప్రదేశాలలో తవ్వకాలను చేపట్టాయి. దొరికిన నిక్షేపాన్ని ప్రభుత్వానికి అప్పగించిన కస్తూరవ్వ, ఆమె కుమారుడు ప్రజ్వల్ రిత్తి (14)కి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఏమేం ఇస్తారంటే
ప్రజ్వల్ కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు స్థానిక గ్రామపంచాయతి 30 ఇన్ టు 40 అడుగుల స్థలాన్ని ఇవ్వనుంది. అలాగే గ్రామంలోని పాఠశాలలు, కార్యాలయాల్లో కాలేజీల్లో ప్రజ్వల్ రిత్తి ఫోటో పెడతారు. ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. అతనికి ఉచిత విద్య, తరువాత ఉద్యోగం కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రిపబ్లిక్ డే ఉత్సవాలలో కుటుంబాన్ని సన్మానించి, అక్కడే అన్ని కానుకలను అందిస్తారు. పంచాయతీ సభ్యులు ఆ కుటుంబాన్ని సన్మానించారు.
లక్కుండి నిధి దాత ప్రజ్వల్‌కు
కానుకల వెల్లువ
కొత్త ఇల్లు, చదువు, ఉద్యోగం..
కొత్త ఇల్లు, చదువు, ఉద్యోగం..


