రాఘవేంద్రుల సన్నిధిలో భక్తి వైభవం
బనశంకరి: బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లో వెలసిన నంజనగూడు శ్రీ గురురాఘవేంద్రస్వామి మఠంలో గురువారం శ్రీసుజయేంద్రతీర్థస్వాముల ఆరాధనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం పంచామృతాభిషేకం, కనకాభిషేకం, ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. మహామంగళహారతి తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. సాయంత్రం రథోత్సవం, గజవాహనోత్సవం, అష్టావధాన, తొట్టెలు పూజ ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తమోహ ఆర్ట్స్ ఫౌండేషన్ విదుషి గాయత్రి మయ్యా, విద్యార్థినుల బృందం నృత్య ప్రదర్శన ఆహుతులను ఆలరించింది. నందకిశోర్ ఆచార్, మఠం సిబ్బంది పాల్గొన్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
రాఘవేంద్రుల సన్నిధిలో భక్తి వైభవం


