ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

Nov 22 2025 7:38 AM | Updated on Nov 22 2025 7:38 AM

ఒకే కుటుంబంలో  నలుగురి ఆత్మహత్య

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

ధార్వాడలో పెను విషాదం

హుబ్లీ: ధార్వాడలో పెను విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన చిక్కమల్లిగెవాడ గ్రామంలో చోటుచేసుకుంది. చిక్కమళ్లిగవాడలో నివాసముంటున్న నారాయణషిండేకు కుటుంబ సమస్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిన ఆయన తన తండ్రి విఠల్‌ రావ్‌(85), తన పిల్లలైన శివరాజ్‌ (12), శ్రీనిధి (10)లతో కలిసి నారాయణ షిండే(42) బావి వద్దకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలోనే ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement