అరటిగెలలో గంజాయి, సిగరెట్లు
శివాజీనగర: ఉచిత ప్రవేశం, ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫాం, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, క్షీరభాగ్య, మధ్యాహ్న వేడిభోజనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పలు పథకాల మధ్య కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు గత ఒకటిన్నర దశాబ్దంలో పిల్లల నమోదు ప్రమాణం 30 శాతానికి తగ్గిపోయింది. 2010–11వ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశం పొందుతున్న పిల్లల సంఖ్య సుమారు 55 లక్షల వరకు ఉండేది. అయితే ఇది 2025–26వ విద్యా సంవత్సరం నాటికి 38 లక్షలకు తగ్గిపోయింది. 15 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య 17 లక్షలకు పైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంలో పాఠశాల విద్యకు ప్రవేశం పొందే పిల్లల మొత్తం నమోదులో 54 శాతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల వాటా నేడు 38 శాతానికి తగ్గింది.
విద్యా శాఖ గణాంకాల ప్రకారం..
ఇది ఏదో సంఘ సంస్థల సమీక్షలో బహిరంగమైన ఆంశాలు కాదు, స్వయంగా విద్యాశాఖ, 15 సంవత్సరాల విద్యా సమాచార విశ్లేషణ నివేదికలను ఆవలోకించినపుడు వెల్లడైన వాస్తవాలు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలోనే మరో 800 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను ప్రారంభించాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. విద్యా శాఖే ఈ విషయం గురించి కొంత మేరకు సమాచారం బహిరంగపరిచింది. మరో వైపు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్న పిల్లల సంఖ్య విస్తారంగా పెరుగుతోంది. 15 సంవత్సరాల క్రితం ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 30 లక్షల వరకు ఉన్న పిల్లల సంఖ్య నేడు 47 లక్షలకు పెరిగింది. అంటే ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు 30 శాతం కంటే అధికమైంది.
స్కూళ్లు, టీచర్ల సంఖ్య కూడా తగ్గుముఖం
పిల్లల సంఖ్య తక్కువవుతుండగా 15 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, వాటిలో పని చేస్తున్న పర్మనెంట్ ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2010–11లో శాఖ విద్యా విశ్లేషణ నివేదిక ప్రకారం 45 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు, 4000కు పైగా ఉన్నత పాఠశాలలతో పాటు 49,855 పాఠశాలలు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సంఖ్య తగ్గుముఖం పట్టినా కూడా ప్రాథమిక పాఠశాలల సంఖ్య సుమారు 35 వేలకు తగ్గింది. పిల్లల కొరత, విలీనం తదితర కారణాలతో ఈ పాఠశాలలు మూతపడ్డాయి.
రాష్ట్రంలో 41,500 ప్రాథమిక పాఠశాలలు
గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 41,500 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల సంఖ్య 4,800కు పెరిగిందని వెల్లడించింది. 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 2.26 లక్షలకు పైగా ఉండేది. అది నేడు 1.80 లక్షలకు తగ్గింది. 56 వేలకు పైగా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 6 వేల మంది ఉపాధ్యాయులు రిటైరవుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మాత్రం ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవటం లేదు.
15 ఏళ్లలో 30 శాతం మేర తగ్గిన ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలు
ఉచిత ప్రవేశం, యూనిఫాం, పుస్తకాలు, వేడిభోజనం ఇచ్చినా రాని వైనం
రాష్ట్రంలో 38 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక
అరటిగెలలో గంజాయి, సిగరెట్లు
అరటిగెలలో గంజాయి, సిగరెట్లు


