పాఠశాలల మూసివేత తగదు
హొసపేటె: కర్ణాటకలో 25 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా గురువారం ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఏఐడీఎస్‌ఓ నేత రవికిరణ్ మాట్లాడుతూ గొప్ప మానవతావాది జ్యోతిరావు పూలే జ్ఞాపకార్థం నవంబర్ 21 నుంచి 28 వరకు ప్రభుత్వ పాఠశాలలను కాపాడటానికి, బలోపేతం చేయడానికి వారం రోజుల పాటు పోరాటం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 6,000 కర్ణాటక పబ్లిక్ స్కూల్స్(కేపీఎస్) మాగ్నెట్‌లుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కర్ణాటక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యను తమ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కొత్త పథకం ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి మూసివేయడానికి రూపొందించిన మరో మోసపూరిత ప్రయత్నం అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ శృతికి అందజేశారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
చెళ్లకెరె రూరల్: ఇంటిలోని బీరువా ఇంటర్‌లాక్‌ను పగలగొట్టి రూ.20 లక్షలకు పైగా నగదు, బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన నగరంలోని విఠల్ నగర్‌లో గురువారం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ దుకాణం యజమాని మల్లికార్జున ఇంటిలో ఈ దొంగతనం జరిగింది. పట్టపగలే ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ సత్యనారాయణరావు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనా స్థలానికి శ్వానదళం, వేలిముద్రల నిపుణులతో సహా ఎస్‌ఐ శివరాజ్, ధరప్పలు కూడా వెళ్లి పరిశీలించారు. ఘటనపై చెళ్లకెరె పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
వాహనదారులకు
రోడ్డు నియమాలు తప్పనిసరి
చెళ్లకెరె రూరల్: వాహనదారులు రహదారి సురక్షత నియమాలను తప్పకుండా పాటించాలని డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు. ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రోడ్డు సురక్షత సప్తాహ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బైక్ మీద వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను ధరించాలన్నారు. కారు డ్రైవర్లు సీట్ బెల్ట్‌ను ధరించాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యపానం సేవించడం, మొబైల్ ఫోన్ వాటడం చేయరాదు. నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆటోడ్రైవర్లకు పోలీసు శాఖ నుంచి నెంబర్‌ను కేటాయిస్తారన్నారు. ఈ నెంబర్లను ఏడు రోజుల్లోగా ఆటోలకు వేయించుకోవాలి. లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఆటో, ప్రైవేట్, స్కూల్ బస్సు యజమానులు పాల్గొన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం
హొసపేటె: నగరంలో వివిధ అభివృద్ధి పనులకు నగరసభ సభ్యులు ముక్తకంఠంతో అంగీకారం తెలిపారు. గురువారం నగరసభ అధ్యక్షుడు రూపేష్ కుమార్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. నగరంలోని వివిధ వార్డులకు 2025–26వ సంవత్సరానికి 15వ ఆర్థిక పరిమితి నిధుల కింద ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులకు మంజూరు చేసిన నిధులకు సభ్యులు ఆమోదం తెలిపారు. కాంట్రాక్టర్లు పారదర్శకంగా పనులు చేపట్టాలని కోరారు. ఉపాధ్యక్షులు జీవరత్న, నగరసభ అధికారి మన్సూర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు.
అక్రమ మద్యాన్ని అరికట్టాలి
రాయచూరు రూరల్: అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేయాలని మద్య నియంత్రణ పోరాట సమితి సంచాలకురాలు మారెమ్మ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా గ్రామ సభ ద్వారా నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్థాయిలో అధికారం అప్పగించాలని ఒత్తిడి చేశారు. మద్యపాన నిషేధ చట్టం ప్రకారం మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రామ సభ నుంచి అనుమతి పొందాలన్నారు. పాన్, బీడా దుకాణాల్లో విక్రయించే మద్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. లేని పక్షంలో చిన్న పిల్లలు మద్యానికి బానిస అవుతారని ఆరోపించారు.10 రోజుల్లో ప్రభుత్వం అక్రమ మద్యం విక్రయాలకు పుల్ స్టాప్ పెట్టక పోతే నవంబర్ 25న బెంగళూరులో పెద్ద ఎత్తున ఆందోళనకు నడుం బిగించామన్నారు. రాధ, శారద హులి నాయక్, హుచ్చమ్మలున్నారు.
పాఠశాలల మూసివేత తగదు
పాఠశాలల మూసివేత తగదు
పాఠశాలల మూసివేత తగదు
పాఠశాలల మూసివేత తగదు


