రైతు పంప్‌సెట్ల చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: రైతు పంప్‌సెట్లను చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ నియోజకవర్గంలోని కోర్విహాళ్‌లో నరసింగ్ ఇంటి ముందు ఉంచిన 18 మోటార్ పంప్‌సెట్లను దొంగలించిన తెలంగాణ గుడిగండ్ల విజయ్ కుమార్, ఆదిగౌడలను అరెస్ట్ చేశామన్నారు. వాటి విలువ రూ.4,31,000 ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.
వృద్ధాశ్రమంలో
ఆకస్మిక తనిఖీ
హుబ్లీ: కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ ఆధ్వర్యంలో నగరంలోని నవనగర్ సిటీ పార్కు 6వ క్రాస్‌లోని రెండంతస్తుల వివేకానంద వృద్ధాశ్రమాన్ని గురువారం మధ్యాహ్నం జిల్లాధికారిణి దివ్యప్రభు సూచన మేరకు జిల్లా దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సవితా కాళె సీనియర్ ఉద్యోగి అన్నప్ప కోళితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
మరుగుదొడ్ల వాడకంపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వినియోగంపై జాగృతి జాతాను నిర్వహించారు. బుధవారం గ్రామీణ నియోజకవర్గంలోని మిట్టి మల్కాపూర్, దేవనపల్లిలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరుగుదొడ్ల వినియోగ దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించి బహిరంగ మల విసర్జన వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ప్రజలకు పీడీఓ రేణుక వివరించారు. స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద మంజూరైన మరుగుదొడ్లను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఫౌండేషన్ అధికారిణి సౌమ్య, సారాబాను, శేషమ్మ, హనుమంతు, రేఖ, ప్రశాంతి పాల్గొన్నారు.
అధ్యాపకులకు పీహెచ్‌డీలు
బళ్లారి రూరల్: రావు బహదూర్ వై.మహాబళేశ్వరప్ప ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు అధ్యాపకులకు పీహెచ్‌డీ లభించినట్లు ఆ
కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ హనుమంతరెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన డాక్టర్ ఏ.శివమ్మ గైడ్ డాక్టర్ సి.సులోచన సాయంతో సం స్టడీస్ ఆన్ కన్వెన్సివ్ హీట్ ట్రాన్స్‌ఫర్ ఇన్ మ్యాగ్నటిక్ హైడ్రో డైనమిక్స్ నాన్ న్యూటోనియా ప్లూయిడ్స్ ఫ్లోస్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందింది. డాక్టర్ కే.మహేష్ గైడ్ ఎంఎస్ శోభ సాయంతో స్టడీ ఆన్ ఫైబర్ రీఎన్‌ఫోర్స్‌డ్ టెరిటరీ బ్లెండెడ్ హైపర్‌ఫామెన్స్ కాన్‌క్రీట్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. డాక్టర్ బీ.దీప గైడ్ డాక్టర్ సంతోష్‌కుమార్ హంపన్నవర్ సాయంతో మైక్రోపేసర్ మేజర్‌మెంట్ యూనిట్ సిన్‌క్రో పవర్ టెక్నాలజీ ఫర్ సిచ్యుయేషనల్ ఆవేర్‌నెస్ ఇన్ స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందింది. డాక్టర్ శ్రీదేవి మాలిపాటిల్ గైడ్ టి.హనుమంతరెడ్డి సాయంతో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ టెక్నిక్స్ ఫర్ మైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డేటా ఐటెమ్స్ ఆన్ అన్‌సర్‌టైన్ డేటాబేస్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందినట్లు తెలిపారు.
కాటికాపరులకు
పనిముట్ల వితరణ
రాయచూరు రూరల్: గ్రామీణ నియోజకవర్గంలోని యద్లాపూర్, గుంజహళ్లి, హెగ్గసనహళ్లి, హనుమాన్‌దొడ్డి, వడ్లూరుల్లో గురువారం గ్రామాల్లోని శ్మశానాల్లో పని చేసే కాటికాపరులకు పనిముట్ల వితరణ జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతో సమాధి గుంత తవ్వడానికి, మట్టి పూడ్చడానికి కావాల్సిన పనిముట్లను వితరణ చేశారు. యద్లాపూర్ జీపీ అధ్యక్షురాలు పార్వతమ్మ, పీడీఓ చెన్నమ్మ, కేజీ వీరేష్, రామప్ప, ముద్దప్ప పాల్గొన్నారు.
వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం కోటలో వెలసిన కల్‌కోటె వీరభద్రేశ్వరాలయం, బెస్తవారపేట వీరభద్రేశ్వరాలయం నుంచి కిల్లే మఠం వీరభద్రేశ్వర ఆలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగించారు. వీరగాసె నృత్యం చేస్తూ ఒడుపులు చెబుతూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
రైతు పంప్‌సెట్ల చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రైతు పంప్‌సెట్ల చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్


