ట్రక్ డ్రైవర్లకు విశ్రాంతి గృహం ప్రారంభం
బళ్లారి అర్బన్: జిందాల్ కర్మాగారంలో ట్రక్ డ్రైవర్లకు విశ్రాంతి గృహాన్ని సంబంధిత జిందాల్ సంస్థ ఆవరణలో గురువారం జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ చైర్ పర్సన్ సంగీత జిందాల్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ట్రక్ డ్రైవర్లు ఎంతో కష్టపడి సంస్థ అభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. సుమారు 600 మందికి పైగా ట్రక్ డ్రైవర్లు ఈసందర్భంగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ రవాణా సమయంలో డ్రైవర్లు సహజంగా ఎంతో ఒత్తిడికి గురవుతారన్నారు. ఫలితంగా ఎన్నో రోగాలు ఇతర అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతాయన్నారు. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక పద్ధతిలో 104 పడకలు ఉన్న నాలుగు డార్మెటరీలు, 10 స్నానపు గదులు, 10 మరుగుదొడ్లు, మూడు అత్యాధునిక వాషింగ్ యంత్రాలు, రెండు బట్టలు ఉతికే, ఆరబెట్టే యంత్రాలు, ఆరు బయలు స్థలంలో టీవీ హాల్, పూర్తిగా ఏసీ వసతితో కూడిన విశ్రాంతి గదులను ట్రక్ డ్రైవర్ల కోసం ఏర్పాటు చేశామన్నారు. జేఎస్‌డబ్ల్యూ సీనియర్ అధికారులు పీకే.ఘోరే, భువనేశ్వరి మురుగన్, సునీల్‌రాల్ఫ్, పెద్దన్న, సన్ని, ఈయప్పన్, అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్రక్ డ్రైవర్లకు విశ్రాంతి గృహం ప్రారంభం


