ఎడతెగని దోపిడీలు | - | Sakshi
Sakshi News home page

ఎడతెగని దోపిడీలు

Nov 21 2025 7:07 AM | Updated on Nov 21 2025 7:07 AM

ఎడతెగ

ఎడతెగని దోపిడీలు

బనశంకరి: కర్ణాటకలో, ప్రత్యేకించి బెంగళూరు నగరంలో దోపిడీకేసులు హెచ్చుమీరడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత మూడేళ్లలో 4,806 దోపిడీకేసులు నమోదయ్యాయి. తాజాగా సిలికాన్‌ సిటీలో రూ. 7.11 కోట్ల నగదును దోచేయడం పరాకాష్టగా మారింది. ఇలా దోపిడీదారుల పాలిట టార్గెట్‌గా మారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ మూల బీదర్‌ నుంచి ఇటు బెంగళూరు వరకు పగలూ రాత్రి తేడా లేకుండా దొంగలు బ్యాంకులు, ఏటీఎంలు, నగదు తరలించే వాహనాలపై విరుచుకుపడడం చూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు సహజంగానే తీవ్రమయ్యాయి. గత మూడేళ్లలో 4,806 దోపిడీలు, డెకాయిట్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. గత రెండేళ్లలో అనేక బ్యాంకు దోపిడీలు సంభవించాయి. 5 కేజీల నుంచి 50 కేజీల వరకు ప్రజలు దాచుకున్న బంగారం దొంగల పాలైంది. కొన్ని కేసుల్లో దోపిడీదారులు పట్టుబడగా, కొన్ని కేసుల్లో జాడ లేదు. ఈ దోపిడీలను చూస్తున్న ప్రజలకు తమ డబ్బు, బంగారం భద్రంగా ఉంటాయా? అనే సందేహాలు వెంటాడుతున్నాయి.

రాష్ట్రంలో కొన్ని ప్రముఖ బ్యాంకు దోపిడీలు

మనగోళి కెనరా బ్యాంక్‌ దోపిడీ

2025 మే నెలలో విజయపుర జిల్లా మనగోళి కెనరాబ్యాంక్‌ దోపిడీకి గురైంది. బ్యాంకు మేనేజర్‌ బ్యాంకు దోపిడీకి మాస్టర్‌మైండ్‌ కావడం విశేషం. సుమారు రూ.53 కోట్ల బంగారం దోపిడీ జరిగింది. ఈ కేసులో ముగ్గురు పట్టుబడ్డారు.

బీదర్‌లో కాల్పులు జరిపి..

2025 జనవరి 16 తేదీన బీదర్‌లో పట్టపగలే ఎటీఎంలో నగదు నింపే సిబ్బందిపై బిహార్‌ దొంగలు కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలో గిరివెంకటేశ్‌ అనే ఉద్యోగి చనిపోగా, శివకుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. దొంగలు దొరకలేదు.

మంగళూరు కోటికార్‌బ్యాంక్‌ దోపిడీ....

2025 జనవరి 17 తేదీన మంగళూరు కోటికార్‌ వ్యవసాయసేవా సహకారసంఘం బ్యాంకులోకి తుపాకులతో వచ్చిన దుండగులు రూ.4 కోట్ల బంగారం, డబ్బును దోచేశారు. తమిళనాడులో ముగ్గురు దోపిడీదారులను అరెస్ట్‌చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ ఘటనలు కొన్ని మాత్రమే. దోపిడీలు, దొంగతనాల అడ్డుకట్టకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసు శాఖ చెబుతోంది.

చిక్కరు.. దొరకరు.. దోపిడీదారులు

రాష్ట్రంలో గత మూడేళ్లలో ముఖ్య నేరాల సమాచారం

సైబర్‌ నేరాలు

2023లో– 22,253

2024– 22,472

2025– 8,620

హత్యలు

2023లో– 1291

2024– 1203

2025– 717

దోపిడీలు

2023లో– 1877

2024– 1,607

2025 – 618

చెలరేగిపోతున్న దొంగల ముఠాలు

బ్యాంకులు, ఆర్థిక సంస్థలే టార్గెట్‌

సామాన్యుల్లో గుబులు

చడచణ ఎస్‌బీఐ బ్యాంకులో..

2025 సెప్టెంబరు నెలలో విజయపుర జిల్లా చడచణ స్టేట్‌బ్యాంక్‌లో దోపిడీ జరిగింది. గన్‌ చూపించి సిబ్బందిని బందించి దోపిడీకి తెగబడ్డారు. సుమారు రూ.21 కోట్లు విలువచేసే బంగారు నగలు, నగదు దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీదారులను పోలీసులు అరెస్ట్‌చేసి సొత్తును సీజ్‌ చేశారు

న్యామతి ఎస్‌బీఐలో

2024 అక్టోబరు లో దావణగెరె జిల్లా న్యామతిఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.13 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకున్నారు. పోలీసులు తమిళనాడు కు చెందిన దోపిడీదారులను అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎడతెగని దోపిడీలు1
1/2

ఎడతెగని దోపిడీలు

ఎడతెగని దోపిడీలు2
2/2

ఎడతెగని దోపిడీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement