సర్కారీ బడుల్లో ఎల్‌కేజీ, యూకేజీ
శివాజీనగర: రాష్ట్రంలో 4,056 ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ ప్రత్యేక తరగతులను ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు ఆంగ్ల స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఇలాంటి తరగతులు సర్కారీ బడుల్లోనూ ఆరంభమైతే లక్షలాది మంది తల్లిదండ్రులకు ప్రయోజనం లభిస్తుంది. అల్లరి పిల్లలను ముందుగానే బడులకు పంపేయవచ్చు. ప్రైవేటు స్కూళ్లలో ఎల్‌కేజీలో చేర్పించాలంటే వేలాది రూపాయల ఫీజులను చెల్లించాలి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది ఎంతో భారం అన్నది తెలిసిందే.
మార్గదర్శకాలు ఇలా..
● మొదటిదశలో 2018–19 నుంచి 2024–25 మధ్య ప్రారంభమైన 2,619 పాఠశాలల్లో ఎల్‌కేజీ తరగతులకు నాంది పలుకుతారు.
● ద్విభాషా మాధ్యమం అమలవుతుంది.
● ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తరగతులు సాగుతాయి.
● ఎల్‌కేజీ, యూకేజీల గురించి విద్యాశాఖ స్థానికంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజెప్పాలని సర్కారు ఆదేశించింది.
● ఎల్‌కేజీకి 4, 5 సంవత్సరాల వయసుగల బాలలను చేర్చుకోవచ్చు. ఒక తరగతికి గరిష్టంగా 40 మంది పిల్లల ఉండవచ్చు.
● ఈ మేరకు పలు మార్గదర్శకాలను విద్యాశాఖ రూపొందించింది. అదనంగా ఉపాధ్యాయ సిబ్బంది నియామకాలకు ఆదేశాలిచ్చారు.
ప్రభుత్వం ఆదేశాలు
పిల్లలకు ముందే ప్రాథమిక విద్య


