
ఉదయమే ఉలికిపాటు
బనశంకరి: ఉదయమే నిద్రలేచిన నగరవాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా భారీ శబ్ధంతో కూడిన పేలుడు ఉలికిపాటుకు గురి చేసింది. కిలోమీటర్ల మేర వినిపించిన శబ్దానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో పేలుడు చోటు చేసుకొని బాలుడు మృతి చెందగా, 12 మంది గాయపడిన ఘటన బెంగళూరు నగరంలోని ఆడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. విల్సన్‌గార్డెన్ ఆడుగోడి చిన్నయ్యనపాళ్య, శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న కస్తూరమ్మ అనే మహిళ ఇంట్లో పేలుడు సంభవించింది. పక్కింటిలో ఉంటున్న ముబారక్(8) అనే బాలుడు మృతి చెందగా కస్తూరమ్మ, సరసమ్మ, సబ్రీనా బాను, సుబ్రమణి, షేక్‌నజీబ్ ఉల్లా, 8 ఏళ్ల బాలిక ఫాతిమాతో పాటు 12 మంది గాయపడ్డారు. కస్తూరమ్మ కుమార్తె ఖయాల్‌కు కాలిన గాయాలు కావడంతో వీక్టోరియా ఆస్పత్రికి, మిగిలినవారిని సంజయ్ గాంధీ, జయనగర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటిలో ఇంటిపైకప్పు సమేతంగా ధ్వంసం కాగా మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతింది. 8 ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. ఆడుగోడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.
బెంగళూరు నగరంలో విస్ఫోటం
ఆడుగోడి చిన్నయ్యనపాళ్య పరిధిలోని శ్రీరామ కాలనీలో ఘటన
బాలుడు మృతి, 12 మందికి గాయాలు
మృతుడి కుటుంబానికి
రూ.5 లక్షల పరిహారం
ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య
పేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సిద్దరామయ్య
శ్రీరామ కాలనీలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు పేలుడు సంభవించిందని, ఇది ఎలా జరిగిందనేది ఘటనాస్థలానికి సుకో టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు చేరుకుని పరిశీలిస్తున్నాయని కమిషనర్ తెలిపారు. పేలుడు జరిగిన ఇంటిలో శకలాలు తొలగించి సాంకేతిక బృందం అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపడతామని కమిషనర్ తెలిపారు. సిలెండర్ పేలితే మంటలు వచ్చేవన్నారు. మంటలు రాకున్నా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, కరెంట్ షాక్‌తో ఇలా జరిగిందా లేక మెట్రో పనులు ఇక్కడ చేపడుతుండటంతో ప్రమాదం సంభవించిందా? అని తెలియడంలేదని స్దానికులు అనుమానం వ్యక్తం చేశారు.
పనులకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డ ప్రజలు
శ్రీరామ కాలనీలో చాలా మంది ఉదయం లాల్‌బాగ్‌లో పనులకు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. లేని పక్షంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. పేలుడుతో ఆ ప్రాంత నివాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం 8 గంటలకు భారీ పేలుడు జరిగిందని, పేలుడు జరిగిన ఇంటికి, తమ ఇంటికి నాలుగు అడుగుల దూరం అని, పరిస్థితి భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు.

ఉదయమే ఉలికిపాటు

ఉదయమే ఉలికిపాటు

ఉదయమే ఉలికిపాటు

ఉదయమే ఉలికిపాటు